News November 10, 2024

రాజమండ్రి: ట్రైనీ‌అల్ ఇండియా సర్వీస్ అధికారుల సందర్శన 

image

అల్ ఇండియా సర్వీసెస్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు. తమ శిక్షణలో భాగమైన ఫీల్డ్ స్టడీ&రీసెర్చ్ ప్రోగ్రామ్ సందర్భంగా మన్నన్ సింగ్, అనురాగ్ బబెల్, ప్రియారాణి, షాహీదా బేగమ్, పార్త్, కశీష్ భక్షి, స్నేహపన్న, జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సింగ్, తుషార్ నెగి అతుల్ మిశ్రా నగరపాలక సంస్థ కార్యాలయంను సందర్శించి కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Similar News

News November 14, 2024

పంచారామక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పూజలు

image

సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా  దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆమె ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. ఆమె మాట్లాడుతూ.. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

News November 14, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా

image

తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.109.40 ఉండగా డీజిల్ ధర రూ.96.79 ఉంది. అలాగే కాకినాడ జిల్లాలో పెట్రోల్ రూ.108.91 ఉండగా డీజిల్ రూ.96.78 గా ఉంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లీటరు డీజిల్ ధర రూ. 97.55 ఉండగా, పెట్రోల్ రూ.109.73 గా ఉంది.

News November 14, 2024

పెద్దాపురం: హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

కల్లు గీత కత్తితో ఇద్దరిని హతమార్చిన కేసులో ముద్దాయికి బుధవారం జీవిత ఖైదు విధిస్తూ పెద్దాపురం కోర్టు తుది తీర్పు ఇచ్చినట్లు జగ్గంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేటకు చెందిన వానశెట్టి సింహాచలం భార్యతో నైనపు శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడిని, దానికి సహకరించిన బత్తిన భవానీని హతమార్చాడు. దీనిపై 2013లోనే కేసు నమోదైంది. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత తుది తీర్పు వెలువడింది.