News November 11, 2024

భారీ భూకంపం.. వణికిన క్యూబా

image

క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. బార్టోలోమోకు 40 కి.మీ దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఆ సమీపంలోని మంజనిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు.

Similar News

News January 25, 2026

పన్ను వసూళ్లలో ఎదురేలేదు..

image

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ట్యాక్స్ వసూళ్ల విషయంలో హాంకాంగ్(13.1%), ఇండోనేషియా(13.1%), మలేషియా(12%)ను ఇండియా వెనక్కి నెట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడించింది. ‘దేశ ట్యాక్స్-GDP నిష్పత్తి 19.6%గా ఉంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట, GST, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం వంటివి ఇందుకు కారణం. జర్మనీ-38%, అమెరికా-25.6%తో మెరుగ్గా ఉన్నాయి’ అని పేర్కొంది.

News January 25, 2026

తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

image

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.

News January 25, 2026

సూర్యుడు ఎలా జన్మించాడో తెలుసా?

image

బిగ్ బ్యాంగ్ థియరీ విశ్వం ఎలా పుట్టిందో చెబుతుంది. అలాగే మన పురాణాలు ఓంకార విస్ఫోటనం నుంచి కాంతి, సూర్యుడు జన్మించాయని చెబుతున్నాయి. సూర్యగోళానికి అధిపతి మార్తాండుడు. ఈయన కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల కుమారుడు. మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడు జన్మించాడని ప్రతీతి. సూర్య జననం జరగకముందే ఇతర గ్రహాలు పుట్టాయట. కానీ వాటికి గమనం లేదు. సూర్యుడు జన్మించాకే సృష్టికి ఒక క్రమ పద్ధతి, దిశ ఏర్పడ్డాయి.