News November 11, 2024
ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు.
Similar News
News April 18, 2026
గుంటూరులో NHM పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి!

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో 7 ఎన్‌హెచ్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు www.guntur.nic.in లో దరఖాస్తులు పొందవచ్చని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.800, ఇతరులు రూ.500 ఫీజు బ్యాంకులో చెల్లించాలి. నింపిన దరఖాస్తులను ఈ నెల 18 నుంచి 30 లోగా నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలి.
News April 18, 2026
GNT: తీర్పు నేడే.. మళ్లీ కస్టడీ దొరుకుతుందా?

అక్రమాస్తుల కేసులో అరెస్టైన దేవదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.