News November 11, 2024
అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ప్రతిభ పరీక్ష

అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ఆదివారం R&B,ఎన్టీపీసీ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతిభ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు అనకాపల్లి, చోడవరం, ఎస్.రాయవరం, రావికమతం, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర మండలాల నుంచి 100 మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు మార్గదర్శిగా నిలుస్తాయన్నారు.
Similar News
News March 21, 2026
విశాఖ: ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్.ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్‌లు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు.
News March 21, 2026
24న విశాఖ రానున్న రాష్ట్ర గవర్నర్

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ రానున్నారు. 24వ తేదీ రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని రాత్రికి ఒక హోటల్లో బస చేస్తారు. 25న ఉదయం10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.