News November 11, 2024

ట్రంప్ ఎన్నికతో భారత్‌కు ఆందోళన లేదు: జైశంకర్

image

US ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని ఆందోళన చెందే దేశాల్లో భారత్ లేదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘చాలా దేశాలు ట్రంప్ గెలుపుపై ఆందోళన చెందాయి. భారత్‌కు అలాంటి టెన్షన్ లేదు. ఆయన గెలవగానే కాల్ చేసిన తొలి ముగ్గురిలో PM మోదీ కూడా ఉన్నారు. వారిద్దరికీ మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఇతర దేశాలతో బంధం బలోపేతం చేసుకోవడంలో ప్రధాని చేసిన కృషి భారత్‌కు ఉపకరించింది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2024

అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.

News December 26, 2024

సినీ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ

image

TG: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశముంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 26, 2024

హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున

image

TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.