News November 11, 2024

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రానంటోంది: PCB

image

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆ దేశానికి వెళ్లేందుకు భారత్ నిరాకరించిందని PCB తెలిపింది. ఈ మేరకు BCCI నుంచి లేఖ అందినట్లు వెల్లడించింది. మరి ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించే ఆలోచన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేయాల్సి ఉండగా భారత్ ప్రాతినిధ్యం వహించడంపై స్పష్టత రాకపోవడంతో అది సాధ్యపడలేదు.

Similar News

News November 14, 2024

RBI వడ్డీరేట్లను తగ్గించాల్సిందే: పీయూష్ గోయల్

image

వడ్డీరేట్ల తగ్గింపునకు ఆహార ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవడం లోపభూయిష్ఠమైన థియరీ అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్రభుత్వానిది కాదు. RBI కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గించాల్సిందే. మోదీ హయాంలో ఇన్‌ఫ్లేషన్ స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత తక్కువగా ఉంది’ అన్నారు. FIIల సెల్లింగ్‌పై మాట్లాడుతూ దీర్ఘకాల దృక్పథంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.

News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.

News November 14, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.75,650 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 తగ్గి రూ.69,350కి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,000 తగ్గి రూ.99,000లు పలుకుతోంది. గోల్డ్ 4 రోజుల్లో రూ.3,710, వెండి రూ.4,000 తగ్గడం విశేషం.