News November 11, 2024
PM E-DRIVE: ఎవరికి వర్తిస్తుంది?

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకమే PM E-DRIVE. దీనికింద ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీవీలర్స్(ఆటోరిక్షాలు), ట్రక్కులు, బస్సులకూ సబ్సిడీ వస్తుంది. బ్యాటరీ సామర్థ్యంపై సబ్సిడీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ-కార్లకు మాత్రం సబ్సిడీ రాదు. అయితే అధునాతన బ్యాటరీ అమర్చిన ఈవెహికిల్స్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది.
Similar News
News November 5, 2025
ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News November 5, 2025
నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.
News November 5, 2025
అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.


