News November 11, 2024
HYD: బండి సంజయ్ దళిత వ్యతిరేకి: డా. లింగస్వామి

తెలంగాణ ఉన్నత విద్యా కమిషన్ రద్దు చేయాలని, ఛైర్మన్‌గా నియమించబడ్డ ఆకునూరి మురళిని తొలగించాలనడం బండి సంజయ్‌కి దళితుల మీదున్న వ్యతిరేకతకు నిదర్శనమని అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా. మంచాల లింగస్వామి ఆరోపించారు. బండి సంజయ్, BJP దళితులకు వ్యతిరేకమని, దళిత ఐఏఎస్ అధికారిని తొలగించాలన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి అనర్హుడని, ఆయనను బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News November 7, 2025
22 నుంచి నగరంలో పలు చోట్ల భగవద్గీత పోటీలు

టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భగవద్గీత పోటీలు జరుగనున్నాయి. 22న కుత్బుల్లాపూర్(వేణుగోపాలస్వామి గుడి), 28న టీటీడీ బాలాజీ భవన్, 29న సరూర్‌నగర్ (విక్టోరియా మెమోరియల్ స్కూల్)లో పోటీలు జరుగుతాయని టీటీడీ అధికారి రమేశ్ కుమార్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 90308 50336 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
News November 7, 2025
HYD: KTR.. రాసిపెట్టుకో..!: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRS పార్టీ పతనానికి రెఫరెండమని, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరంకొట్టారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ మీ సీటు గాయబే.. ఇక్కడి నుంచి మీ పార్టీ కనుమరుగు కావడం ఖాయం.. రాసిపెట్టుకో KTR’ అని పేర్కొంది. కాగా జూబ్లీహిల్స్‌లో BRS గెలవదని, కచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.


