News November 11, 2024
అమరావతికి రూ.15K కోట్ల రుణం.. నేడు సంతకాలు

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అందించే రూ.15,000 కోట్ల <<14576900>>రుణంపై<<>> నేడు కీలక ముందడుగు పడనుంది. రుణ ఒప్పందాలపై ఢిల్లీలో సీఆర్డీఏ, బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ నిధులతో అమరావతిలో ప్రధాన రహదారులు, స్మార్ట్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, లిఫ్ట్ స్కీమ్‌లు, తాగునీటి సరఫరా, హైకోర్టు, సచివాలయం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల భవనాలను నిర్మిస్తారు.
Similar News
News April 17, 2026
‘టాక్సిక్’ స్టోరీ లైన్ చెప్పిన యశ్

ఇండిపెండెన్స్ సమయంలో గోవాలో జరిగే తండ్రీ కొడుకుల రివేంజ్ డ్రామాగా ‘టాక్సిక్’ తెరకెక్కిందని హీరో యశ్ వెల్లడించారు. లాస్ వేగాస్(US)లో జరిగిన CinemaCon వేడుకల్లో 9 నిమిషాల మూవీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కొన్నేళ్లపాటు గోవాలో కొనసాగిన పోర్చుగీస్ పాలనలో పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
News April 17, 2026
హార్ముజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు చెందిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి $89.26కు చేరింది. మరోవైపు USకు చెందిన WTI క్రూడ్ $10.45 తగ్గి $84.24కు, UAEకి చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి $93.46కు చేరాయి. యుద్ధంతో ఓ దశలో $150కి చేరుతుందనుకున్న చమురు ధర ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది.
News April 17, 2026
GTతో మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న KKR

అహ్మదాబాద్ వేదికగా GTతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బ్యాటింగ్ ఎంచుకుంది.
GT: గిల్, సుదర్శన్, బట్లర్, సుందర్, ఫిలిప్స్, తెవాటియా, రషీద్, అశోక్ శర్మ, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
KKR: సీఫెర్ట్, నరైన్, రహానే, గ్రీన్, రఘువంశీ(w), పావెల్, రింకూ, రమణదీప్, అనుకుల్ రాయ్, వైభవ్, కార్తీక్


