News November 11, 2024

భారీ వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని IMD వెల్లడించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఏయే జిల్లాలకు వర్షం ముప్పు ఉందో <>ఇక్కడ క్లిక్<<>> చేసి తెలుసుకోవచ్చు.

Similar News

News August 31, 2025

లింగ నిర్ధారణకు పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.

News August 31, 2025

అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు

image

TG: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే <<17479379>>ప్రభుత్వానికి లేఖ<<>> రాశామని, అయినా స్పందన రాలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. బిల్లుల పెండింగ్‌‌తో చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News August 31, 2025

విద్యార్థులకు రాగిజావ.. 40% ఖర్చు భరించనున్న ప్రభుత్వం!

image

TG: సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వారానికి 3 రోజులపాటు రాగిజావను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు అయ్యే ఖర్చులో 40% భరించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. మిగతా ఖర్చును శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు భరిస్తుంది. ట్రస్టుతో కలిసి గత రెండేళ్లుగా ప్రభుత్వం రాగిజావను అందిస్తోండగా, ఈ ఏడాది ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మళ్లీ రాగిజావ పంపిణీ ప్రారంభం కానుంది.