News November 11, 2024
ఈ ఏడాది విశాఖలో నేవీ డే వేడుకలు లేనట్లే

ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన విశాఖలో బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం విశాఖలో కాకుండా ఒడిశాలో గల బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నిర్వహించనున్నట్లు ఈస్ట్రన్ నావల్ కమాండ్ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌ను డీడీ నేషనల్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.
Similar News
News April 16, 2026
విశాఖ-భవానిపట్న రైలు రీషెడ్యూల్

విశాఖపట్నం-భవానిపట్న ప్యాసింజర్ రైలు (58504) రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఆలస్యంగా రావడంతో రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి కదులుతుంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
News April 16, 2026
విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ఏప్రిల్ 16 రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, ఏప్రిల్ 16 అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
News April 16, 2026
సింహాచలంలో రేపు ఆర్జిత సేవలు బంద్

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.


