News November 11, 2024
నాగర్‌కర్నూల్: తల్లి, వదిన సహయంతో హత్య

అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. SI నరేందర్‌రెడ్డి వివరాలు.. తిమ్మాజిపేట(M) రాళ్లచెరువుకు చెందిన శీను(40), గోపాల్ అన్నదమ్ములు. అన్న భార్యతో గోపాల్ వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గోపాల్.. వదిన, తల్లి సహయంతో శీనును చంపేశాడు. మృతదేహాన్ని గోపాల్ అత్తగారింటి వద్ద పడేయటం చూసిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదైంది.
Similar News
News February 5, 2026
MBNR: బాలానగర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 14.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 15.0, గండీడ్ మండలం సల్కర్ పేట 15.2, మిడ్జిల్ మండలం దోనూరు 15.4, జడ్చర్ల 15.5, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.6, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ లో 16.0, మిడ్జిల్ 16.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.
News February 4, 2026
ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన: డీఈఓ

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలు తీరును డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, మాక్ టెస్ట్ ఫలితాలు, యాక్షన్ ప్లాన్ అమలును సమీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News February 4, 2026
పాలమూరు అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు: డీకే అరుణ

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఆమె మాట్లాడారు.. విమానాశ్రయాలకు దీటుగా అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.


