News November 11, 2024
వైసీపీ ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహణ!

AP: ఇవాళ ఉదయం 10.30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో శాసనసభకు వెళ్లొద్దని నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశం ఉంది. శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
Similar News
News November 6, 2025
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు

మ్యాప్స్‌లో గూగుల్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. జెమినీ ఏఐ, వాయిస్ ఇంటరాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్స్, యాక్సిడెంట్లు జోన్ల వార్నింగ్, మెట్రో టికెట్ బుకింగ్స్ సదుపాయాలు తెస్తోంది. వాయిస్ ఇంటరాక్షన్‌తో డ్రైవింగ్‌లో ఉండగానే రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. రైడర్లు బైక్ ఐకాన్, రంగును మార్చుకోవచ్చు. రోడ్డు గరిష్ఠ వేగం కూడా తెలుసుకునే ఫీచర్ వస్తోంది.
News November 6, 2025
జీవితం సంతోషంగా మారాలంటే..?

రాగద్వేషాలను వదిలిపెట్టి, మన ఇంద్రియాలకు సాక్షిగా ఉన్న ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించాలి. అలా మనం ఏకాగ్రతతో ఆయనపై భక్తి చూపి, ధ్యానం చేసినప్పుడు, ఈ దేహమే నేను అనే అహంకారం నశించిపోతుంది. దేహాభిమానం తొలగిపోతుంది. అప్పుడు సుఖదుఃఖాలు మనల్ని బాధించవు. ఇక బయటి ఆలోచనలు, కోరికలు పక్కన పెట్టాలి. మనసును పరమాత్మపై లగ్నం చేయాలి. ఫలితంగా నిజమైన శాంతి, ఆత్మనిర్భరత లభిస్తాయి. అప్పుడే జీవితం సంతోషమయం. <<-se>>#WhoIsGod<<>>
News November 6, 2025
చాప్‌మన్ విధ్వంసం.. 28 బంతుల్లో 78 రన్స్

విండీస్‌తో రెండో T20లో కివీస్ బ్యాటర్ చాప్‌మన్ విధ్వంసం సృష్టించారు. 28 బంతుల్లోనే 78 పరుగులు చేశారు. ఇందులో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో NZ తరఫున ఒక T20Iలో అత్యధిక స్ట్రైక్‌రేటు(279)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 20 ఓవర్లలో 207-5 స్కోర్ చేయగా, WI 204-8 స్కోరుకు పరిమితమై ఓడిపోయింది. పావెల్ 45(16B), షెఫర్డ్ 34(16B), ఫోర్డే 29(13B) రన్స్ చేసినా ఫలితం లేకపోయింది.


