News November 11, 2024

తలసరి ఆదాయంలో విశాఖనే నంబర్ 1

image

ఏపీలో జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా తలసరి ఆదాయం లెక్కలు బహిర్గతమయ్యాయి. 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.4.83 లక్షలతో విశాఖ టాప్ ప్లేస్‌లో ఉంది. రూ.2.10 లక్షలతో అనకాపల్లి 10వ స్థానంలో నిలవగా.. రూ.1.37 లక్షలతో అల్లూరి సీతారామరాజు చివరి స్థానానికి పరిమితమైంది. 2021-22లో కృష్ణా మొదటి స్థానంలో విశాఖ 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 14, 2024

విశాఖలో కబ్జాలను ఆధారాలతో నిరూపిస్తా: బండారు

image

విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో ప్రస్తావించారు. సుమారు రూ.3వేల కోట్లు విలువ చేసే 300 ఎకరాల భూమిని వైసీపీ హయాంలో ప్రజలను భయపెట్టి లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి హస్తం ఇందులో ఉందని తనకు అవకాశం ఇస్తే పూర్తి ఆధారాలతో నిరూపిస్తా అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలని బండారు కోరారు.

News November 14, 2024

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు భోగిలు

image

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463/64), భువనేశ్వర్-తిరుపతి-భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ (22879 /80)నకు రెండు థర్డ్ ఏసీ భోగిలు, అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-దిఘా, గాంధిగామ్ సూపర్ ఫాస్ట్‌లకు అదనపు భోగిలు జత చేశామని తెలిపారు.

News November 14, 2024

నేటి నుంచి ఇంటింటికి సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం

image

విశాఖలో నేటి నుంచి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని డిఎంహెచ్ఓ జగదీశ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో అవగాహనా శిబిరం నిర్వహించారు.18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్‌ పరీక్షలు చేసి అవసరమగు వారికీ వైద్యం అందిస్తారని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించికోవాలన్నారు.