News November 11, 2024

నువ్వు నాకు ప్రత్యేకం.. సాయిపల్లవిపై జ్యోతిక ప్రశంసలు

image

‘అమరన్’ సినిమాలో సాయిపల్లవి నటన సూపర్ అంటూ హీరోయిన్ జ్యోతిక ఇన్‌స్టా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ మీకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉందని బదులిచ్చారు. ‘సాయి.. నువ్వు గొప్ప నటివి. నీ నటన నాకు నచ్చుతుంది. నువ్వు ఎంచుకున్న పాత్రకు న్యాయం చేస్తావు. అందుకే నువ్వు నాకు స్పెషల్’ అని పల్లవికి జ్యోతిక రిప్లై ఇచ్చారు.

Similar News

News November 11, 2025

ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

గట్లు చెక్కే యంత్రంతో కలిగే లాభాలు

image

సాధారణంగా ఇద్దరు మనుషులు రోజంతా కష్టపడితే ఎకరం పొలంలో గట్టు చెక్కగలరు. ఈ యంత్రం సహాయంతో ఒక రోజులో 15 నుంచి 25 ఎకరాల వరకు గట్లు చెక్కవచ్చు. ఈ యంత్రం సాయంతో గంటకు 3-4 ఎకరాల్లో.. దాదాపు 18 ఇంచుల వరకూ గట్లు చెక్కవచ్చంటున్నారు నిపుణులు. ఈ మెషిన్ భాగాలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం వల్ల బురదలో నడిచినా తుప్పు పట్టవు. అతి ముఖ్యంగా కూలీల కొరత సమస్యకు ఈ యంత్రం చెక్ పెడుతుంది.

News November 11, 2025

SAతో వన్డే సిరీస్‌కు అయ్యర్ దూరం?

image

నవంబర్ 30 నుంచి ప్రారంభంకానున్న SA ODI సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ‘అతను పూర్తిగా కోలుకుని సెలక్షన్‌కు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. గాయమైనప్పుడు 10 నిమిషాలు అయ్యర్ ఆక్సిజన్ లెవల్స్ 50కి పడిపోయాయి. కంప్లీట్ బ్లాకౌట్ అయ్యాడు’ అని BCCI సోర్సెస్ చెప్పినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అతనికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిపింది.