News November 11, 2024
సంజూ ఖాతాలో చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో రెండో టీ20లో డకౌట్ అయిన సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ సార్లు(4) సున్నాకే వెనుదిరిగిన భారత ప్లేయర్‌గా నిలిచారు. రోహిత్ శర్మ 2018లో, విరాట్ కోహ్లీ 2024లో మూడుసార్ల చొప్పున డకౌటయ్యారు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక సార్లు(12) సున్నాకే ఔటైన అవాంఛిత రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది.
Similar News
News January 14, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ రానున్నారు.
News January 14, 2025
కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే: కేటీఆర్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తెలంగాణ పరిస్థితి Kakistocracyగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పదానికి అర్థం పనికిరాని లేదా తక్కువ అర్హత కలిగిన చిత్తశుద్ధి లేని పౌరుల చేతిలో పాలన ఉండటం. బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News January 14, 2025
‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లపై ఆర్జీవీ సెటైర్లు
‘గేమ్ ఛేంజర్’ మూవీ కలెక్షన్లపై దర్శకుడు RGV సెటైర్లు వేశారు. ఒకవేళ GC తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే ‘పుష్ప-2’ రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న RRR మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో అబద్దాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు రాసుకొచ్చారు.