News November 11, 2024

రోహిత్ ఆడకపోతే కెప్టెన్ ఎవరంటే?

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడటంపై ఇప్పటివరకు క్లారిటీ లేదని కోచ్ గంభీర్ చెప్పారు. అయితే హిట్‌మ్యాన్ ఆడతారనే ఆశిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. సిరీస్ మొదలయ్యే ముందు దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టు ఆడకపోతే బుమ్రా సారథిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాహుల్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేస్తారని తెలిపారు.

Similar News

News November 4, 2025

నేపాల్‌లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్‌పై సుప్రీంకోర్టు

image

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.

News November 4, 2025

రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

News November 4, 2025

డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

image

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.