News November 11, 2024

FLASH: మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 తగ్గి రూ.78,760కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గడంతో రూ.72,200 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గడంతో రూ.1,02,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News December 27, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునదా
నెక్కినబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ!
తాత్పర్యం: అవసరానికి పనికిరాని బంధువును, నమస్కరించి వేడుకున్నా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధంలో ముందుకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలెను.

News December 27, 2024

6 నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం: మేరుగు

image

AP: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గిస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్పారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైరయ్యారు. ఇప్పుడు ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టారని దుయ్యబట్టారు. ప్రజలపై 6 నెలల్లోనే రూ.15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. కూటమి పాలన బాదుడే బాదుడుగా ఉందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

News December 27, 2024

డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు

image

✒ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
✒ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
✒ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
✒ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
✒ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జననం
✒ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
✒ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత