News November 11, 2024
రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక సీఐ కాశీవిశ్వనాథం తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన ప్రణీత్, హైదరాబాదుకి చెందిన వెంకన్న ఓ లారీని అధిగమించబోయి లారీని ఢీకొన్నారు. ఇద్దరికీ గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించగా ..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News August 20, 2025
గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కందుల

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద పెరుగుతున్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గోదావరి నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం, వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలు పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
తూ.గో: ఓవర్‌స్పీడ్‌పై స్పెషల్ డ్రైవ్.. 298 కేసులు నమోదు

వేగంగా వాహనాలు నడిపిన వారిపై వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 298 ఓవర్‌స్పీడ్ కేసులు నమోదు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ డ్రైవ్ ఆగస్టు 11 నుంచి 17వ తేదీ వరకు కొనసాగిందని, ఈ-చలానాల రూపంలో రూ.3.10లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ స్పెషల్ డ్రైవ్‌ల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
News August 19, 2025
‘మత్తు’కు దూరంగా ఉండండి: ఈగల్ ఐజీ

రాజమండ్రి సెంట్రల్ జైలులో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఈగల్ ఐజి ఏకే రవికృష్ణ మంగళవారం మాట్లాడారు. ఎన్‌డీపీఎస్ చట్టం తీవ్రతను వారికి ఆయన వివరించారు. భవిష్యత్తులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. అనంతరం గంజాయి వాడబోమని ఖైదీలతో ప్రతిజ్ఞ చేయించారు.