News November 11, 2024

KMM: ప్రేమ పేరుతో మోసం.. MLA వద్దకు యువతి

image

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది. ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది. పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.

Similar News

News November 11, 2025

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియామకం

image

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవులో ఉన్న జైనీని ఖమ్మం డీఈవోగా నియమించారు. ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్న శ్రీజ స్థానంలో రెండు రోజుల్లో చైతన్య జైనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తిస్థాయి అధికారిని నియమించాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ఈ నియామకం జరిగినట్లు సమాచారం.

News November 11, 2025

ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

image

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.

News November 11, 2025

ఖమ్మం: ఆయిల్ పామ్ పంట రైతులకు అధిక లాభాలు: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సహకార సంఘాల డైరెక్టర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయిల్ పామ్ లాభసాటి పంట అని అన్నారు. వరి, పత్తి, మిర్చి పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.50వేల సబ్సిడీతో పాటు ప్రభుత్వం డ్రిప్, నిర్వహణ ఖర్చులకు సహాయం అందిస్తుందని ఈ సంవత్సరం జిల్లాకు 14,500 ఎకరాల సాగు లక్ష్యం ఉన్నట్లు తెలిపారు.