News November 11, 2024
క్వాలిటీ లేని ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్న నెస్లే, పెప్సీ: REPORT

నెస్లే, పెప్సీ, యూనిలివర్ సహా MNC ఫుడ్ కంపెనీలు భారత్ వంటి తక్కువ ఆదాయ దేశాల్లో నాణ్యత లేని ప్రొడక్టులు అమ్ముతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. హెల్త్ రేటింగ్ సిస్టమ్‌లో వీటికి తక్కువ స్కోర్లు వచ్చినట్టు ATNI తెలిపింది. ఇందులో 3.5 కన్నా ఎక్కువ రేటింగ్ వచ్చే ఫుడ్ ప్రొడక్టులను హెల్దీగా పరిగణిస్తారు. రిచ్ కంట్రీస్‌లో ఈ సగటు స్కోరు 3.5 ఉండగా పూర్ కంట్రీస్‌లో 1.8గా ఉంది. 70% జనాభా పేద దేశాల్లోనే ఉంది.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


