News November 11, 2024
కులగణనపై కుట్రలను తిప్పికొట్టండి.. కార్యకర్తలకు పీసీసీ చీఫ్ పిలుపు

TG: కులగణనపై ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కులగణన చేపట్టి ఆయా కులాల జనాభాను బట్టి రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ కచ్చితమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్యుమరేటర్లతో పాటు కార్యకర్తలు కూడా ప్రజల ఇళ్లకు వెళ్లి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
Similar News
News November 1, 2025
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.
News November 1, 2025
టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.
News November 1, 2025
కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.


