News November 11, 2024

DANGER: పిల్లలకు కూల్‌డ్రింక్స్ కొనిస్తున్నారా?

image

పిల్లలకు కూల్ డ్రింక్స్ కొనివ్వొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తయారీదారులే కార్బోనేటెడ్ శీతల పానీయలను పిల్లలకు సిఫార్సు చేయొద్దని వాటిపై రాస్తున్నారని తెలిపారు. పిల్లలు కెఫిన్ కలిపిన సోడాను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, మద్యం తాగాలనే ఆలోచనలు రావడం, అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Similar News

News February 20, 2026

యాక్సెంచర్ కొత్త రూల్: AI వాడితేనే ప్రమోషన్.. లేదంటే నో ఛాన్స్!

image

ప్రమోషన్ కావాలంటే కంపెనీకి చెందిన AI టూల్స్ వాడటం తప్పనిసరని యాక్సెంచర్ తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు తమ రోజువారీ పనిలో AI టూల్స్ వాడుతున్నారో లేదో HR విభాగం ఇకపై నిశితంగా గమనించనుంది. ఇందుకోసం వారు వారానికి ఎన్నిసార్లు లాగిన్ అయ్యారో ట్రాక్ చేస్తోంది. AIకి అలవాటు పడని వారు కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని గతంలోనే CEO జూలీ స్వీట్ హెచ్చరించారు.

News February 20, 2026

ముడతలను ఇలా తగ్గించుకోండి

image

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్‌C, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.

News February 20, 2026

ESIC నోయిడాలో ఉద్యోగాలు

image

యూపీ, నోయిడాలోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ & హాస్పిటల్ 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 25న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MD, MS, DM, MCh, DNB, DrNB, MSc(మెడికల్ అనాటమీ), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2,23,543, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in