News November 11, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్టు గుర్తించారు.

Similar News

News March 22, 2026

టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

image

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

News March 22, 2026

PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

image

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

News March 22, 2026

అస్సాం.. ఏ కూటమిలో ఏ పార్టీ?

image

అస్సాం ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని BJP, అధికారమే లక్ష్యంగా INC హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి AGP, UPPL, BPF పార్టీలతో కలిసి బీజేపీ, CPM, AJP, APHLCలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు గెలుచుకున్న AIUDF ఒంటరిగా బరిలో దిగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సీఎం హిమంత, పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతామని గౌరవ్ గొగొయ్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#Elections2026<<>>