News November 11, 2024
ఎన్టీఆర్: పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎస్పీలు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీలు ప్రజల నుంచి 66 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విన్న వారు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వారికి చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
Similar News
News November 22, 2024
YV సుబ్బారెడ్డికి కృష్ణా జిల్లా బాధ్యతలు
వైవీ సుబ్బారెడ్డి వైసీపీ అధిష్ఠానం గురువారం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్-కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయనకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
News November 22, 2024
నేడే పీఏసీ ఛైర్మన్ ఎన్నిక.. నామినేషన్ వేసిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే
శాసనసభలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. కాగా తాతయ్యతో పాటు NDA కూటమి నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. ఛైర్మన్‌తో పాటు PACలో మొత్తం 9 మంది సభ్యులను నేడు శాసనసభలో స్పీకర్ అయ్యన్న సమక్షంలో సభ్యులు ఎన్నుకుంటారు.
News November 22, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. 25తో ముగియనున్న గడువు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA & MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 25లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది.