News November 11, 2024

ప్రారంభంలో లాభాలు.. చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి

image

సోమ‌వారం మిడ్ సెష‌న్ వ‌ర‌కు 251 పాయింట్ల లాభంతో సాగిన‌ నిఫ్టీ చివ‌రికి 6 పాయింట్ల న‌ష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వ‌ద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వ‌ద్ద‌, సెన్సెక్స్‌లో 80,100 వ‌ద్ద ఉన్న కీల‌క‌మైన రెసిస్టెన్స్‌ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.

Similar News

News September 13, 2025

ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

image

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.

News September 13, 2025

కోహ్లీ లేడు.. పాక్‌కు ఇదే మంచి సమయం: మిస్బా

image

ఆసియా కప్‌లో భాగంగా రేపు మ్యాచ్‌ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్‌ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్‌లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్‌ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.

News September 13, 2025

సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

image

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.