News November 11, 2024
తిరుపతి: సైబర్ నేరాల పట్ల DGP అవగాహన

సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం అవగాహన కల్పించారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని సుమారు 900 పాఠశాలలు, 60 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను DGP వివరించారు. మహిళా దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు.
Similar News
News September 18, 2025
అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోండి: DMHO

పారామెడికల్ ట్రైనింగ్ 2025-26 కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అక్టోబర్ 4 వరకు గడువు పెంచినట్లు DMHO సుధారాణి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.appmb.co.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్లను జత చేసి రూ.100లను DMHO కార్యాలయంలో అందించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
News September 18, 2025
విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి

కుప్పం (M) బైరప్ప కొటాలకు చెందిన కీర్తి(18)కి రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. ఐదు నెలల కిందట డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వచ్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టి నాలుగు నెలలు కావస్తున్నా భార్య కాపురానికి రాలేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపనానికి గురైన రాజేష్ తన భార్య గొంతు కోసి, ముఖంపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.