News November 11, 2024

చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ

image

AP: CM చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ.40వేల కోట్లతో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టులు, విశాఖలో TCS ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. భేటీలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.

Similar News

News January 25, 2026

బృహస్పతి చంద్రుడిపై జీవం ఉందా?

image

బృహస్పతి (Jupiter) చంద్రుడైన యూరోపాపై ఆసక్తికరమైన ప్రక్రియ జరుగుతోంది. బరువైన ఉప్పు మంచు గడ్డలు క్రమంగా లోపల ఉన్న సముద్రాన్ని చేరుతున్నాయి. దీంతో జీవం మనుగడకు అవసరమైన ఆక్సిజన్ వంటి పోషకాలు సముద్రంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ‘సింకింగ్ ఐస్’ విధానంతో జీవం మనుగడకు అవకాశం ఉంది. నాసా 2024లో ప్రయోగించిన ‘యూరోపా క్లిప్పర్ మిషన్’ 2030కి అక్కడికి చేరుకొని రహస్యాలను వెలికి తీయనుంది.

News January 25, 2026

కళ్లు ఇలా ఉంటే కిడ్నీ సమస్యలు!

image

కళ్లు ఎర్రబడటం, అలసట, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లూ, ఎల్లో రంగులను సరిగ్గా గుర్తించలేవు. డబుల్, బ్లర్ విజన్, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు కలుగుతాయి. కళ్లు పొడిబారడం, దురద సమస్యలు ఎదురవుతాయి. యూరిన్‌లో ప్రొటీన్ లీకై కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి ఉబ్బినట్టు కనిపిస్తాయి. యూరిన్‌లో నురుగు లేదా బుడగలు ఉన్నా కిడ్నీల పనితీరు సరిగ్గా లేదని గుర్తించాలి.

News January 25, 2026

విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

image

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్‌లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్‌లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.