News November 11, 2024

మచిలీపట్నం : సముద్ర స్నానాల ఏర్పాట్ల పరిశీలన

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంగినపూడి బీచ్ వద్ద జరిగే సముద్ర స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. సముద్ర పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.

Similar News

News November 25, 2024

ఉపాధి కల్పనలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా 4వ స్థానం 

image

ఎంఎస్ఎంఈ (మైక్రో,స్మాల్‌&మీడియం ఎంటర్ప్రైజెస్) ద్వారా కృష్ణాజిల్లాలో 14,729 యూనిట్లు రూ.491.88కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. ముందు వరుసలో విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే-2024 వెల్లడించింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో 2023-27ల్లో 19,86,658 మందికి ఉపాధి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై మీ కామెంట్ 

News November 25, 2024

మచిలీపట్నం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

image

మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిజాంపేటకు చెందిన దంపతులు గోపీకృష్ణ-వాసవి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2011లో వీరికి వివాహం కాగా  ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యతో చిన్న చిన్న గొడవలు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు గోపీకృష్ణ తెలిపాడు.

News November 25, 2024

మండవల్లి: ‘ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేశాడు’

image

మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రోయ్యూరు నగేశ్ బాబు అనే నిందితుడు తన తమ్ముడు రోయ్యూరు సురేశ్, అత్త భ్రమరాంభను కత్తితో దారుణంగా హత్యచేశాడని తెలిపారు. ఈ కేసులో 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన కైకలూరు సీఐ రవికుమార్‌ను, ఎస్ఐను డీఎస్పీ అభినందించారు.