News November 11, 2024
వాటర్ వేస్టేజ్ తగ్గించేలా..!
రంగుల బట్టలని తయారుచేసేందుకు ఎంత నీటి కాలుష్యం జరుగుతుందో ప్రజలు పట్టించుకోవట్లేదని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(USA) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా బట్టలకు రంగు అద్దడానికి 5 ట్రిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నారని తెలిపింది. కాగా, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు హీట్‌లెస్ డై ప్రక్రియను అభివృద్ధి చేశామని, దీని ద్వారా 90శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చని చైనాకు చెందిన NTX అనే కంపెనీ వెల్లడించింది.
Similar News
News December 26, 2024
ఆ కారణం వల్లే మహాత్మాగాంధీ హత్య: సోనియా
పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఐకమత్యంగా ముందుకు సాగుదామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ బెలగావి సభలో నేతలకు ఓ సందేశంలో తెలిపారు. ‘స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటమూ చేయని సంస్థలు మహాత్మాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక విషతుల్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వాటి వల్లే ఆయన హత్య జరిగింది. కేంద్రంలో అధికారానికి వచ్చిన వారి వల్ల గాంధీ ఘనత ప్రమాదంలో పడింది’ అన్నారు.
News December 26, 2024
షేక్ హసీనా భవిష్యత్తు ఎటు?
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం ఆసక్తికరంగా మారింది. యూనస్ సర్కారు ఆమెను అప్పగించాలని భారత్‌ను అడిగిన నేపథ్యంలో హసీనా పూర్తిగా భారత్ దయపై ఆధారపడ్డారు. శరణార్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను భారత్ అప్పగించాల్సి ఉన్నా.. యూనస్ భారత వ్యతిరేక వైఖరి కారణంగా హసీనాకు రక్షణ కల్పించేందుకే భారత్ నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News December 26, 2024
జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి
మొజాంబిక్ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.