News November 11, 2024
తూ.గో: కుక్కల దాడిలో వ్యక్తి మృతి
ఉమ్మడి తూ.గో.జిల్లా ఆలమూరు మండలంలో కలవచర్లలో కుక్కల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగర సూర్యారావు పనిలో భాగంగా బయటికి వెళ్లడంతో కుక్కలు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశాయన్నారు. గ్రామస్థులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యారావు ఆసుపత్రిలో మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు.
Similar News
News November 21, 2024
మారేడుమిల్లి: జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ అనంతబాబు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలోని పలు రాజకీయ విషయాలను గూరించి చర్చించామని ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉండమని జగన్ సూచించారని ఎమ్మెల్సీ తెలిపారు. అడ్డతీగల జడ్పీటీసీ వీర్రాజు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై పోరాడాలని సూచించారన్నారు.
News November 21, 2024
శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం
శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.
News November 21, 2024
తూ.గో జిల్లాలో దొంగతనాలు..అరెస్ట్ చేస్తారని సూసైడ్
అరెస్ట్ భయంతో తిరుపతిలో సూర్యప్రభాశ్(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇతనిపై రాజమండ్రిలో దొంగతనం కేసులు నమోదవ్వగా తిరుపతికి పారిపోయాడు. లక్కవరం ఎస్సై రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్సై సంపత్ కుమార్ తమ సిబ్బందితో తిరుపతికి వెళ్లారు. పోలీసులను గమనించి అతను గడియ పెట్టుకొని.. అరెస్ట్ చేస్తారనే భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు.