News November 12, 2024

అల్పపీడనంపై విపత్తు ఎండీతో హోం మంత్రి సమీక్ష

image

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండి రోణంకి కూర్మనాథ్‌తో రాష్ట్ర హోం&విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సమీక్షించారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించానన్నారు.

Similar News

News July 6, 2025

విశాఖలో రేపు P.G.R.S.

image

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు‌ P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.

News July 6, 2025

సింహాచలం గిరిప్రదక్షిణ: పార్కింగ్ స్థలాలు ఇవే-1

image

తొలి పావంచా వద్దకు వచ్చే వారి వాహనాలు అడవివరం జంక్షన్, సింహపురి కాలనీ RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో పార్కింగ్ చెయ్యాలి. హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులు ఆదర్శనగర్, డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి పాయింట్, ఆరిలోవ లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి అనంతరం దేవస్థానం ఉచిత బస్సుల్లో అడవివరం న్యూ టోల్గేట్ వద్దకు చేరుకోవాలి.

News July 6, 2025

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

image

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.