News November 12, 2024
డిసెంబర్‌లోపు జాతీయ రహదారుల పనులు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లాలో NH-544D, NH-67, NH-544DD, NH-42, NH-150A జాతీయ రహదారులకు సంబంధించి వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు భూసేకరణ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.
Similar News
News December 27, 2025
చీనీ పంటలో తెగుళ్లు

అనంతపురం జిల్లాలో చీనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి మొదలైనప్పటి నుంచి పంటకు మంగు తెగులు, పొలుసు పురుగు ఆశించడంతో కాయ నల్లగా మారుతోంది. ఇది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. తాడిపత్రి పరిధిలో చీనీ పంట అధిక సంఖ్యలో సాగులో ఉంది. తెగుళ్ల నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి మందులను క్రమం తప్పకుండా పిచికారీ చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు.
News December 26, 2025
డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ: అనంతపురం కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లాలోని 2,78,388 మందికి రూ.124.47 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31న ఉదయం 6:30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నారు.
News December 26, 2025
అనంతపురం: మహిళలకు అండగా ‘సఖి’ వాహనం

సమాజంలో హింసకు గురయ్యే మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఆశ్రయించవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సఖి వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, బాధితులకు అవసరమైన రక్షణ, సాయం ఇక్కడ అందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.


