News November 12, 2024
రాష్ట్రపతి, గవర్నర్‌కు YCP ఫిర్యాదు
AP: తమ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారని YCP రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వాక్‌స్వేచ్ఛను అణచివేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని తెలిపింది. కల్పిత కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
Similar News
News November 14, 2024
‘సారీ అమ్మానాన్న.. చనిపోతున్నా’
HYD బాచుపల్లి శ్రీచైతన్య కాలేజీలో <<14606404>>ఆత్మహత్య<<>> చేసుకున్న జస్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా వల్లే అన్నీ కష్టాలు. మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా. అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా. నా ఆత్మ శాంతించాలంటే అమ్మ, చెల్లిని బాగా చూసుకో నాన్నా’ అని చావుకు కారణమైనవారి పేర్లు రాశాడు.
News November 14, 2024
రంజీ చరిత్రలో అతిపెద్ద విజయం
రంజీల్లో గోవా జట్టు సంచలనం సృష్టించింది. రంజీ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకుని రికార్డులకెక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫీట్ సాధించింది. ఈ క్రమంలో అస్సాం (త్రిపుర-ఇన్నింగ్స్ 472/1991) రికార్డును అధిగమించింది. ఆ తర్వాత బొంబాయి (సింధ్-ఇన్నింగ్స్ 453/1947), మేఘాలయ (మిజోరం-ఇన్నింగ్స్ 425/2020), బెంగాల్ (అస్సాం-ఇన్నింగ్స్ 413/1952) ఉన్నాయి.
News November 14, 2024
Stock Market: వరుసగా ఆరోసారి నష్టాలు
స్టాక్ మార్కెట్లు గురువారం తేరుకుంటున్నట్టు కనిపించినా ఉదయం 11 తరువాత Sharp Fall రావడంతో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 77,580 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు నష్టంతో 23,532 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా ఆరో సెషన్లోనూ మార్కెట్లు నష్టాల్లో నిలిచాయి. అయితే, సెన్సెక్స్‌కు 77,400 వద్ద, నిఫ్టీకి 23,500 పరిధిలో కీలక మద్దతు లభించడంతో సూచీలు Sideways వెళ్లాయి.