News November 12, 2024
పత్తి రైతులకు ఆందోళన వద్దు: కిషన్‌రెడ్డి

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కొనుగోళ్లు జరుగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. తాను కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో మాట్లాడానని తెలిపారు. గతేడాది పాటించిన నిబంధనలే ఈసారి కూడా సీసీఐ అనుసరిస్తుందని ఆయన చెప్పారు. రైతులు ఆందోళనకు గురై దళారులకు పత్తిని అమ్ముకోవద్దని సూచించారు.
Similar News
News September 17, 2025
మహానంది: భారీ వర్ష సూచన.. జాగ్రత్త అంటూ సందేశాలు!

‘ఈ రోజు మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. అప్రమత్తంగా ఉండాలి’ అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నంద్యాల జిల్లాలోని ప్రజల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. పొలాలకు వెళ్లినవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్‌లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్‌లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.
News September 17, 2025
విలీనం కాకపోతే TG మరో పాక్‌లా మారేది: బండి

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్‌లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్‌ను మించి పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.