News November 12, 2024

జగన్.. పులివెందుల పౌరుషం ఉంటే రా: మంత్రి బీసీ

image

YS జగన్‌ మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోమని చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 27, 2026

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: జేసీ

image

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శుక్రవారం DIEPC సమావేశంలో జేసీ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు వచ్చాయని, 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10,836 పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు.

News February 27, 2026

బి.మఠం: మృతులు బద్వేలు వాసులుగా గుర్తింపు

image

బ్రహ్మంగారిమఠం మండలం నంది పల్లె పాల డైరీ వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు <<19255263>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతులు భార్యభర్తలు కావ్య, ప్రసాద్‌గా స్థానికులు గుర్తించారు.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్తమ్మ నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వీరి తల్లిదండ్రులు బద్వేల్ మున్సిపాలిటీ కుమ్మరి కొట్టాలలో ఉన్నారని తెలుస్తోంది.

News February 27, 2026

బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.