News November 12, 2024
అభ్యర్థుల మార్కుల వెల్లడి గోప్యత ఉల్లంఘన కాదు: కోర్టు

రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల్ని వెల్లడించడం గోప్యత ఉల్లంఘన కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణే కోర్టులో ఉద్యోగానికి పరీక్షలు రాసిన ఓంకార్ అనే వ్యక్తి ఇంటర్వ్యూకు ఎంపిక కాకపోవడంతో అభ్యర్థులందరి మార్కుల వివరాల కోసం RTI దరఖాస్తు చేశారు. అది గోప్యత ఉల్లంఘన అవుతుందంటూ అతడి దరఖాస్తును RTI కమిషనర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఓంకార్ హైకోర్టును ఆశ్రయించగా బెంచ్ తాజా తీర్పునిచ్చింది.
Similar News
News November 9, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, పదినిమిషాల తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి.
News November 9, 2025
బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.


