News November 12, 2024
చైనాలో అతి పెద్ద షాపింగ్ డే గురించి తెలుసా?

వాలంటైన్స్ డేకి పోటీగా చైనాలో 1993లో సింగిల్స్ డే వేడుకలు మొదలయ్యాయి. బ్యాచిలర్స్‌గా ఉన్నవారు ఈ రోజున భారీగా షాపింగ్ చేస్తుంటారు. మొదలైనప్పటి నుంచి ఏటేటా ఈ రోజుకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 14న ప్రారంభమై నిన్న ముగిసిన వేడుకలు చైనా చరిత్రలో సుదీర్ఘ సింగిల్స్ డే వేడుకలుగా నిలిచాయి. గత ఏడాది 156.4 బిలియన్ డాలర్ల షాపింగ్ జరగగా, ఈసారి వ్యాపారం దాన్ని మించిపోతుందని అంచనా.
Similar News
News November 8, 2025
సంతోష సాగరం… ముంబై మహానగరం

ముంబై అనగానే మనకు గజిబిజి జీవితాలు కళ్లముందు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఆసియాలోనే ఇతర నగరాలకు మించి ఎన్నో ఆనందానుభూతుల్ని అందించే ప్రాంతాల్లో నం.1గా నిలిచింది. ‘Time Out’s City Life Index-2025’ సర్వేలో ఇది వెల్లడైంది. సంస్కృతి, జీవన నాణ్యత, స్థానికుల ఆదరణ, ఉపాధి వంటి అంశాలపై సర్వే చేపట్టి సంస్థ విశ్లేషించింది. ఆసియాలోని బీజింగ్, షాంఘై, చాంగ్ మాయి, హనోయ్‌లను ముంబై బీట్ చేసింది.
News November 8, 2025
ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్‌లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.
News November 8, 2025
దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.


