News November 12, 2024

జిల్లాకు వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి

image

ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య విచ్చేశారు. ముందుగా ఉట్నూర్‌లో ఆయన పర్యటించగా ITDA PO ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి దేవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించారు. అలాగే ఉట్నూర్ మండలం బిర్సాయిపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

Similar News

News November 14, 2024

కాసిపేట మండలాన్ని విడిచి వెళ్లిన పెద్దపులి

image

మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని పెద్దధర్మారం, గురువాపూర్, చింతగూడ, మలికేపల్లి, వెంకటాపూర్ శివారులో గత 10రోజులుగా సంచరించిన పెద్దపులి తీర్యాని అడవుల్లోకి తరలి వెళ్లినట్లుగా అటవి శాఖ అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ..తీర్యాని మండలం ఏదులాపూర్ అటవీ శివారులో పులి పాద ముద్రలను అక్కడి అధికారులు కనుగొన్నట్లు వివరించారు.

News November 14, 2024

మంచిర్యాలలో బాలికపై అత్యాచారయత్నం

image

11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఒడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ అదే కాలనీకి చెందిన ఓ బాలికను హైటెక్ సిటి వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు వెల్లడించారు.

News November 14, 2024

ADB: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి: సురేంద్ర మోహన్

image

జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగానే సాగుతుందని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో అధికారులతో, ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు, అభ్యంతరాలు, దరఖాస్తులకు ఈనెల 28 వరకు అవకాశం ఉందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు.