News November 12, 2024

ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా మనిషి ట్రాకింగ్!

image

మనిషి ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా అతడి చివరి లొకేషన్‌ను గుర్తించే మైక్రోబయోమ్ జియోగ్రఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే AI సాంకేతికతను స్వీడన్ పరిశోధకులు రూపొందించారు. ఓ వ్యక్తి ప్రయాణించిన ప్రాంతంలో అతడి శరీరం తాలూకు సూక్ష్మక్రిములు ఉంటాయని, తమ సాంకేతికత ఆ క్రిముల ద్వారా అతడి లోకేషన్‌ని గుర్తిస్తుందని వారు వివరించారు. దీని ద్వారా రోగాల వ్యాప్తిని గుర్తించడం సులువవుతుందని తెలిపారు.

Similar News

News January 7, 2026

భార్యకు వంట రాదని విడాకులా? భర్తపై HC అసహనం

image

TG: భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు అప్లై చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన భార్య పనివేళల దృష్ట్యా వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. తన తల్లి పనులకు సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిందనే అతడి వాదన కూడా సరైంది కాదంటూ విడాకుల అప్పీల్‌ను కొట్టేసింది.

News January 7, 2026

ఇతిహాసాలు క్విజ్ – 120

image

ఈరోజు ప్రశ్న: వాలికి ఉన్న విచిత్రమైన వరం ఏమిటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 7, 2026

ఒకటిన్నర ఎకరా పొలం.. అద్భుత ఆలోచనతో అధిక ఆదాయం

image

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.