News November 12, 2024

FLASH: హాల్‌టికెట్లు విడుదల

image

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <>https://ssc.gov.in/<<>> వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,712 గ్రూప్-C ఉద్యోగాల(లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్)కు ఈ నెల 18న రెండు సెషన్లలో ఆన్‌లైన్ పరీక్ష జరగనుంది.

Similar News

News November 5, 2025

ఎక్కువ సేపు కూర్చుంటే ‘థ్రాంబోసిస్’ వ్యాధి

image

4-6 గంటలు ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో రక్తం గడ్డకట్టే(థ్రాంబోసిస్) వ్యాధి పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక జీవనశైలి, ఎక్కువదూరం ఫ్లైట్ జర్నీలు, ఆస్పత్రుల్లో అధిక సమయం గడపడం వల్ల ఈ రిస్క్ ఉంటుందని వెల్లడైంది. ‘ఇలాంటివారి కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డ కడుతుంది. దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడతారు. దీన్ని మొదట్లోనే నియంత్రించకపోతే ఊపిరితిత్తులు, గుండెకూ సమస్య రావొచ్చు’ అని తేలింది.

News November 5, 2025

‘థ్రాంబోసిస్’ వ్యాధిని నివారించాలంటే?

image

* డెస్క్‌, ఆస్పత్రుల్లో ఎక్కువ గంటలు గడపాల్సి ఉంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
* కూర్చున్న చోటే లెగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వీలుంటే తక్కువ దూరాలైనా నడవాలి.
* ఫ్లైట్, ట్రైన్, బస్సు లాంగ్ జర్నీలలో కనీసం గంటకోసారైనా లేచి నడవాలి. దీనివల్ల కాళ్లలో రక్తసరఫరా మెరుగుపడుతుంది.
* కాళ్ల నొప్పులు ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి.

News November 5, 2025

నవంబర్ 10-19 వరకు సమ్మేటివ్ పరీక్షలు

image

AP: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతులకు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, 6, 7 క్లాసులకు మ.1.15 నుంచి సా.4.15 వరకు జరుగుతాయి. 8-10 తరగతులకు ఉ.9.15 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.