News November 12, 2024

అక్కంపేట కురిచర్లపాడు మధ్య రాకపోకలు బంద్

image

అక్కంపేట కురిచర్లపాడు మధ్యలో కల్వర్ట్ కుంగడంతో అక్కంపేట, కురిచర్లపాడు కసుమూరు మీదుగా నెల్లూరు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి తేలికపాటి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పొట్టేలు కాలవ వంతెనకు ముందు పొలాల వద్ద ఉన్న కల్వర్ట్ మంగళవారం మధ్యాహ్నం కుంగిపోయింది. రాకపోకలకు విఘాతం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు ముళ్లకంప వేసి రాకపోకలు బంద్ చేశారు.

Similar News

News November 4, 2025

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి

image

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాములను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న వారిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురాగా.. జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు.

News November 3, 2025

నెల్లూరు: మా మొర ఆలకించండి సారూ..!

image

క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అర్జీలు ఇస్తున్నారు తప్పితే అవి పరిష్కారం కావడానికి మరలా కిందిస్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన ఓ రైతుకు ఇవ్వాల్సిన పరిహారం తన ఖాతాలో కాకుండా మరొక రైతు ఖాతాలో జమయిందని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఆ సమస్య అలానే ఉండిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

News November 3, 2025

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.45 లక్షల మోసం

image

డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని కొల్లూరు సుధాకర్ అనే వ్యక్తి రూ.45 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ దర్గామిట్టకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.