News November 12, 2024
కోహ్లీకిదే ఆఖరి సిరీస్: కోడై కూస్తున్న ఆసీస్ మీడియా

విరాట్ కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.
Similar News
News February 9, 2026
సైలెంట్ కిల్లర్: భారత్‌లో నలుగురిలో ఒకరికి ‘ఫ్యాటీ లివర్’!

ఇండియా ప్రస్తుతం ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్‌ని ఎదుర్కొంటోంది. డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కేవలం ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ (MASLD) కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురు అడల్ట్స్‌లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి కాలేయం గట్టిపడటం (Fibrosis) వంటి ప్రమాదకర లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయి.
News February 9, 2026
T20WC: చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్

T20WC-2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇటలీతో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 207/4 స్కోర్ చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో 200+ రన్స్ చేసిన తొలి అసోసియేట్ టీమ్(టెస్టు హోదా లేని జట్టు)గా చరిత్ర సృష్టించింది. గతంలో USA 197/3(vsCAN), CAN 194/5(vsUSA), NED 193/4(vsIRE) స్కోర్ చేశాయి. ఇక ఈ మ్యాచ్‌లో జార్జ్ మున్సే 84(54 B), బ్రెండన్ మెక్‌ముల్లెన్ 41(18 B), మైఖేల్ లీస్క్ 22(5 B) అదరగొట్టారు.
News February 9, 2026
మాఘ స్నానం ఇంకా చేయలేదా?

మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో నదీ స్నానాలు చేయాలంటారు. ఒకవేళ చేయలేకపోతే చివరి రోజు ఓ పరిహారం పాటించాలంటున్నారు పండితులు. అలా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ‘ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే కర్పూరంలో 11 లవంగాలు వేయాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపాలి. ఆర్థిక ఇబ్బందుల తొలగింపునకు తమలపాకుపై కుంకుమపువ్వుతో ‘శ్రీ’ అని రాసి పూజ గదిలో ఉంచాలి. భార్యాభర్తలు దీపారాధన చేయాలి’ అని సూచిస్తున్నారు.


