News November 12, 2024

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. <<14057734>>సింగిల్ బెంచ్ తీర్పును<<>> సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ వేయగా, ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం చేసుకోవడం తగదంటూ అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ చేశారు.

Similar News

News December 26, 2024

ఉగ్రవాది మసూద్ అజార్‌కు గుండెపోటు

image

జైషే మహమ్మద్ ఫౌండర్, టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ హార్ట్ ఎటాక్‌కు గురైనట్లు వార్తలొస్తున్నాయి. అఫ్గాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో ఉండగా గుండెనొప్పి రావడంతో చికిత్స కోసం పాక్‌లోని కరాచీకి తరలించారని సమాచారం. ప్రత్యేక వైద్యనిపుణులు ఇస్లామాబాద్ నుంచి కరాచీకి చేరుకొని ట్రీట్‌మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేయడంతో భారత ప్రభుత్వం మసూద్‌ను జైలు నుంచి విడుదల చేసింది.

News December 26, 2024

రోహితే ఓపెనింగ్‌ చేస్తారు: నాయర్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎంసీజీ టెస్టులో ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగుతారని జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు, మూడు టెస్టుల్లో శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను తిరిగి ఓపెనర్‌గా బరిలోకి దించాలని నిర్ణయించినట్లు నాయర్ పేర్కొన్నారు. కేఎల్ రాహుల్ 3వ స్థానంలో ఆడనున్నట్లు తెలుస్తోంది.

News December 26, 2024

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో అంతరాయం!

image

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొబైల్ డేటా & బ్రాడ్‌బ్యాండ్ సేవలు రెండింటిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వెబ్‌సైట్ స్టేటస్ ట్రాకింగ్ టూల్ Downdetector.com ప్రకారం దాదాపు 46% మంది మొత్తం బ్లాక్‌అవుట్‌ను ఎదుర్కొంటున్నారు. 32% మందికి సిగ్నల్ లేదు & 22% మందికి మొబైల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?