News November 12, 2024

All in Red: అన్ని రంగాలు న‌ష్టాల్లోనే

image

Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగ‌ళ‌వారం న‌ష్ట‌పోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services స‌హా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వ‌ల్పంగా లాభ‌ప‌డ్డాయి. ఆగ‌స్టు 5వ తేదీన 23,900 ప‌రిధిలో Nifty స‌పోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వ‌డంతో త‌దుప‌రి ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌పై ఉత్కంఠ నెల‌కొంది.

Similar News

News September 16, 2025

హాస్టళ్ల నిర్మాణం-మరమ్మతులకు నిధులు: CBN

image

AP: SC, ST, BC హాస్టళ్లలో వసతులు మెరుగవ్వాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద రుణం వస్తుంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. SC, ST హాస్టళ్లలో చదివే విద్యార్థులు IIT, IIM వంటి సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి’ అని తెలిపారు.

News September 16, 2025

మరింత సులభంగా మూవీ షూటింగ్స్: దిల్ రాజు

image

TG: రాష్ట్రంలో సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ అని ఓ వెబ్ సైట్ రూపొందిస్తోంది. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి మూవీకి కావాల్సిన లొకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు, HYDతోపాటు రాష్ట్రంలోని హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నాం’ అని FDC చైర్మన్ దిల్ రాజు తెలిపారు.

News September 16, 2025

మళ్లీ భూముల వేలం.. ఎకరాకు రూ.101 కోట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. HYD ఐటీ కారిడార్‌ సమీపంలోని రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్టోబర్ 6న ఈ-వేలం నిర్వహించనుంది. OCT 1 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చింది. రూ.2వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.