News November 12, 2024

HYD: ‘కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయండి’

image

కుల సర్వేలో ఎస్సీ మాదిగ 31ను మెన్షన్ చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ అన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే వివరాలు నింపుతున్న ఫామ్‌లో ఎస్సీ మాదిగ అని మెన్షన్ చేస్తూ, మాదిగ కోడ్ 31గా నమోదు చేసుకోవాలని తెలిపారు. కోడ్‌ను నమోదు చేయని పక్షంలో మాదిగ కులాన్ని జనాభా లెక్కలు తక్కువ చూపిస్తూ, రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

Similar News

News January 17, 2026

మేడారంలో రేపు రాష్ట్ర కేబినెట్‌ కీలక సమావేశం

image

రేపు మేడారంలో రాష్ట్ర కేబినెట్‌ కీలక సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయాన్ని దాటి తొలిసారిగా కేబినెట్‌ సమావేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే MPTC, ZPTC, మున్సిపల్‌ ఎన్నికలు, రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

News January 17, 2026

బీఆర్‌ఎస్‌ MLAలు, MLCలతో నేడు KTR కీలక భేటీ

image

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.

News January 17, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందంటే..?

image

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ బాలాపూర్‌లో శనివారం తెల్లవారుజామున 254కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.