News November 12, 2024
Inflation: సామాన్యులపై ధరల మోత

కూరగాయలు, పండ్లు, నూనెలు ఇతరత్రా నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టాన్ని తాకి 6.21%గా నమోదైంది. ఇది RBI నిర్దేశించుకున్న 4% లక్ష్యం కంటే అధికం. అయితే, Sepలో 5.49%గా నమోదవ్వడం గమనార్హం. అర్బన్ ప్రాంత ద్రవ్యోల్బణం 4.62% నుంచి 5.62 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా నమోదైంది. ధరల మోత సామాన్యులపై పెను భారం మోపుతోంది.
Similar News
News January 14, 2026
సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.
News January 14, 2026
మొక్కల్లో మాంగనీస్ లోప లక్షణాలు – నివారణ

మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.
News January 14, 2026
PPPలో వైద్యసేవలపై కేంద్రం మార్గదర్శకాలు

AP: PPP విధానంలో మెరుగైన వైద్యసేవల కోసం 5 మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది. ఈమేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. న్యూక్లియర్ మెడిసిన్, MMUలు, డెంటల్, రేడియాలజీ, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను PPPలో విస్తరించాలంది. ఎక్విప్, ఆపరేట్, మెయింటైన్ (EOM), ఆపరేట్ అండ్ మెయింటైన్(O and M)ల ద్వారా సేవలు పెంచాలని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలకు చెల్లింపుల విధానంపై కూడా మార్గదర్శకాలను అందించింది.


