News November 12, 2024
BIG BREAKING: గ్రూప్-2 వాయిదా

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు APPSC వెబ్‌సైటును చూడాలని సూచించింది.
Similar News
News July 5, 2025
B2 బాంబర్స్‌తో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

249వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్ బాంబర్స్ వైట్‌హౌస్ మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి మెలానియాతో పాటు ట్రంప్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ Xలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా ఆర్మీ ఈ B2 బాంబర్స్‌తోనే దాడి చేసింది.
News July 5, 2025
ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే..

చాలామంది ఉదయాన్నే మోషన్ అవ్వక అవస్థలు పడతారు. బలవంతంగా వెళ్లేందుకు కష్టపడుతుంటారు. అయితే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాలు వ్యాకోచించి ఫ్రీగా మోషన్ అవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక నిత్యం జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, క్యారెట్, దుంపలు, బఠానీ, బీన్స్, ఓట్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
9న క్యాబినెట్ సమావేశం

AP క్యాబినెట్ సమావేశం ఈ నెల 9న జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జులై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.