News November 12, 2024

గుండె పదిలంగా ఉండాలంటే..!

image

పదికాలాల పాటు మీ గుండె పదిలంగా ఉండాలంటే పొట్ట తగ్గించి నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘పోషక ఆహారాన్ని ఎక్కువగా తినండి. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు తినాలి. కూల్ డ్రింక్స్ వద్దు. వంటల్లో తక్కువ మోతాదులో ఉప్పు వాడండి. పొట్ట నిండా తినడం మానేయండి. ప్రతిరోజూ అరగంట – గంట వ్యాయామం తప్పనిసరి. మద్యం ముట్టకండి. పొగాకు దరిచేరనీయవద్దు. 7-9 గంటలు పడుకోండి. వీలైనంత ప్రకృతితో గడపండి’ అని తెలిపారు.

Similar News

News November 14, 2024

గ్రూప్-4 ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును TGPSC సైట్‌లో పొందుపర్చారు. ఈ బటన్ <>క్లిక్<<>> చేసి ఫలితాలు చూసుకోండి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జులైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. తాజాగా తుది ఫలితాలను రిలీజ్ చేశారు.

News November 14, 2024

టీమ్ ఇండియా ఫొటో షూట్: న్యూ లుక్‌లో కోహ్లీ

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సిరీస్ కోసం భారత క్రికెటర్లకు ఫొటో షూట్ నిర్వహించారు. ఈ ఫొటోల్లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 22 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

News November 14, 2024

రేపు స్కూళ్లకు సెలవు

image

రేపు గురునానక్ జయంతి – కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలీడే ఉంది. అన్ని రకాల విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో శుక్రవారం ఆప్షనల్ హాలీడే మాత్రమే ఇచ్చారు. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.