News November 12, 2024
నెల్లూరు: అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

అత్యాచారం ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ. 23వేల జరిమానా పడినట్లు చిల్లకూరు SI సురేశ్ బాబు తెలిపారు. మండల పరధిలోని ఓ గ్రామంలో 2021లో ఓ మైనర్ బాలికను కావూరు మస్తాన్ బాబు అపహరించి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు మంగళవారం నిందితుడికి శిక్ష ఖారారు చేసినట్లు SI తెలిపారు.
Similar News
News March 11, 2026
నెల్లూరు: వెటర్నరీ క్యాంపులు ఎప్పుడో..!

నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల కిందట వెటర్నరీ క్యాంపులు ఆగిపోయాయి. జిల్లాలో 8 మార్కెటింగ్ కమిటీల పరిధిలో రెండేసి చొప్పున 16 క్యాంపులు చేపట్టాలి. ఒక్కో క్యాంపునకు రూ.25 వేలు చొప్పున మార్కెటింగ్ శాఖ ఖర్చు చేస్తున్నా.. వెటర్నరీ అధికారులు తేదీలు ఖరారు చేయడం లేదు. ఇవి జరిగితే పశువులు, మేకలు, గొర్రెలకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. నెలాఖరు లోపు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లనున్నాయి.
News March 11, 2026
అమ్మాయిలూ.. ఈ నంబర్లు మీ వద్ద ఉన్నాయా.?

మహిళల భద్రత కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై నెల్లూరు జిల్లాలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఆపద సమయంలో తక్షణ పోలీస్ సహాయం పొందేందుకు ప్రతి మహిళా, విద్యార్థిని తప్పనిసరిగా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News March 11, 2026
జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షలో నెల్లూరు కలెక్టర్

అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో CM చంద్రబాబు నిర్వహించిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే ప్రణాళికల పట్ల సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలు వంటి సమాచారాన్ని చర్చించారు.


